ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలిసారిగా బ్రహ్మోస్‌ క్షిపణుల ఎగుమతి

ABN, First Publish Date - 2022-01-29T08:34:39+05:30

భారత తయారీ బ్రహ్మోస్‌ క్షిపణులు, తొలిసారిగా మరోదేశానికి ఎగుమతి కానున్నాయి. ఫిలిప్పీన్స్‌ రక్షణ శాఖ రూ. 2806 కోట్లకు వీటిని కొనుగోలు చేసింది. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రూ. 2806 కోట్లకు ఫిలిప్పీన్స్‌ ఒప్పందం

న్యూఢిల్లీ, జనవరి 28: భారత తయారీ బ్రహ్మోస్‌ క్షిపణులు, తొలిసారిగా మరోదేశానికి ఎగుమతి కానున్నాయి. ఫిలిప్పీన్స్‌ రక్షణ శాఖ రూ. 2806 కోట్లకు వీటిని కొనుగోలు చేసింది. ఈ మేరకు భారత్‌-రష్యా సంయుక్త సంస్థ బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(బీఏపీఎల్‌)తో శుక్రవారం ఒప్పందాన్ని చేసుకుంది. బ్రహ్మో్‌సను భూమిపై నుంచి, జలాంతర్గాములు, నౌకలు, యుద్ధవిమానాల నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఫిలిప్పీన్స్‌ ప్రస్తుతం తీరం నుంచి నౌకలపై దాడి చేసే యాంటీ-షిప్‌ క్షిపణులను కొనుగోలు చేసినట్లు సైనికాధికారులు తెలిపారు. కాగా.. భారత్‌ రక్షణ ఎగుమతులను పెంచే దిశగా ఇదొక కీలక అడుగని ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి శంభుకుమారన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎగుమతులకు వీలు కల్పించే మరిన్ని వ్యవస్థల్ని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నామని, భారత ఉత్పత్తుల పట్ల పలు దేశాలు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయని డీఆర్‌డీఓ చైర్మన్‌ జి. సతీశ్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2022-01-29T08:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising