ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Droupadi murmu కు మద్దతు ప్రకటించిన Mayawati

ABN, First Publish Date - 2022-06-25T17:56:15+05:30

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తాను మద్దతిస్తున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ (NDA) అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తాను మద్దతిస్తున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి శనివారంనాడు ప్రకటించారు. బీజేపీకి, ఎన్డీయేకి మద్దతుగానో, విపక్షాలకు వ్యతిరేకంగానో ఈ నిర్ణయం తీసుకోలేదని, తమ పార్టీని, ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ద్రౌపతి ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయించామని మీడియాతో మాట్లాడుతూ మాయావతి చెప్పారు. తమ ఉద్యమంలో గిరిజన వర్గం కూడా చాలా కీలకమని చెప్పారు.


నన్ను సంప్రదించ లేదు...

కాగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఎంపిక చేసేటప్పుడు తమ పార్టీని విపక్షాలు సంప్రదించలేదని మాయావతి విమర్శించారు. ''బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలి సమావేశానికి ఎంపిక చేసిన కొన్ని పార్టీలను పిలిచారు. ఎన్‌సీపీ శరద్ పవార్ సైతం చర్చల కోసం బీఎస్‌పీని పిలవలేదు. కేవలం ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎంపిక చేశామని చెప్పుకునేందుకే విపక్షాలు ప్రయత్నించాయి'' అని మాయావతి అన్నారు. బీఎస్‌పీ ఒక్కటే జాతీయ పార్టీ అని, దళితుల నాయకత్వం కలిగిన పార్టీ అని ఆమె చెప్పారు. బీజేపీనో, కాంగ్రెస్‌నో, పారిశ్రామికవేత్తల ప్రమేయం ఉన్న పార్టీనో తాము అనుకరించలేదని, అణగారిన వర్గాల కోసం బీఎస్‌పీ నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.

Updated Date - 2022-06-25T17:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising