ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత జలాల్లోకి పాక్ fishing boats...సీజ్ చేసిన బీఎస్ఎఫ్

ABN, First Publish Date - 2022-06-24T12:51:23+05:30

భారత సముద్ర జలాల్లోకి వచ్చిన మూడు పాకిస్థాన్ ఫిషింగ్ బోట్లను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కచ్ (గుజరాత్): భారత సముద్ర జలాల్లోకి వచ్చిన మూడు పాకిస్థాన్ ఫిషింగ్ బోట్లను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని హరామి నాలా క్రీక్ ప్రాంతం వద్ద భారత్-పాకిస్థాన్ సముద్ర సరిహద్దుల్లోకి మూడు పాక్ ఫిషింగ్ బోట్లు వచ్చాయి. దీంతో సముద్ర సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పాక్ బోట్ల కదలికను గమనించిన బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాయి. బీఎస్‌ఎఫ్‌ బలగాలు అక్కడికి రావడం గమనించిన పాక్‌ మత్స్యకారులు తమ పడవలను వదిలి పారిపోయారు. పారిపోయిన పాకిస్థాన్ మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.



స్వాధీనం చేసుకున్న పడవలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, వాటిలో కొన్ని చేపలు, ఫిషింగ్ పరికరాలు తప్ప అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు.అంతకుముందు ఏప్రిల్ 4వతేదీన కూడా ఇదే హరామీ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ బోట్‌ను బీఎస్‌ఎఫ్ సీజ్ చేసింది.

Updated Date - 2022-06-24T12:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising