ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ బోటు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

ABN, First Publish Date - 2022-04-04T21:11:23+05:30

భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోటును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, కచ్ ప్రాంతం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో హరామీ నాలా ఏరియాలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు చేపల బోట్లు ప్రవేశించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోటును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, కచ్ ప్రాంతం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో హరామీ నాలా ఏరియాలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు చేపల బోట్లు ప్రవేశించాయి. ఇది భారత సరిహద్దు కావడంతో వెంటనే గమనించిన భారత సరిహద్దు భద్రతా దళ సిబ్బంది పాక్ బోట్లను వెంబడించారు. ఇది గమనించిన బోట్లు వెంటనే పాక్ జలాల్లోకి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఒక బోటును పిల్లర్ నెంబర్ 1160 వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదేశం భారత్-పాక్ సరిహద్దుకు వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది. హరామి నాలా ప్రాంతం భారత్-పాక్‌ల సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడ నిత్యం బీఎస్ఎఫ్ సిబ్బంది పహారా కాస్తుంటారు. మరోవైపు పాకిస్తాన్ జాలర్ల నుంచి స్వాధీనం చేసుకున్న బోటులో ఎలాంటి అనుమానాస్పద సామగ్రి లేదని అధికారులు చెప్పారు.

Updated Date - 2022-04-04T21:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising