ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దుల్లో పాక్ నుంచి వస్తున్న china డ్రోన్...కూల్చివేసిన బీఎస్ఎఫ్

ABN, First Publish Date - 2022-04-30T12:30:22+05:30

పాకిస్థాన్‌ దేశం నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తున్న చైనా డ్రోన్‌ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు కూల్చివేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమృత్‌సర్(పంజాబ్)‌: పాకిస్థాన్‌ దేశం నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తున్న చైనా డ్రోన్‌ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు కూల్చివేశారు. పంజాబ్‌ రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చైనా డ్రోన్ ను తెల్లవారుజామున కూల్చివేసినట్లు బీఎస్‌ఎఫ్ దళం ప్రతినిధి తెలిపారు.అమృత్‌సర్ ప్రాంతంలోని ధనో కలాన్ గ్రామం సమీపంలోని పాక్ సరిహద్దుల్లో ముందు సైనికులు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున సరిహద్దుల్లో ఎగురుతున్న చైనా డ్రోన్ ను బీఎస్ఎఫ్ అడ్డుకొని కూల్చివేశారు.డీజేఐ మ్యాట్రిస్ -300 మోడల్ కు చెందిన మేడ్ ఇన్ చైనా డ్రోన్ ను ఉదయం 6.15 గంటల సమయంలో సరిహద్దుల్లో కూల్చివేసి దాన్ని స్వాధీనం చేసుకున్నామని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. పాక్ వైపు నుంచి చైనా డ్రోన్ రావడంతో సరిహద్దుల్లో భారత సైనికులు అప్రమత్తమయ్యారు. 


Updated Date - 2022-04-30T12:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising