ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య సిబ్బంది తప్పిదం.. గర్భంలో తెగిపోయిన శిశువు తల

ABN, First Publish Date - 2022-06-21T20:36:03+05:30

వైద్యంలో నిర్లక్ష్యం తీవ్ర విషాదానికి దారితీసిన ఘటన పాకిస్తాన్‌లో వెలుగులోకి వచ్చింది. అనుభవం లేని సిబ్బంది తప్పిదానికి.. డెలివరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెషావర్ : వైద్యుల నిర్లక్ష్యం తీవ్ర విషాదానికి దారితీసిన ఘటన పాకిస్తాన్‌లో వెలుగులోకి వచ్చింది. అనుభవం లేని సిబ్బంది తప్పిదం కారణంగా డెలివరీ సమయంలో నవజాత శిశువు తల తల్లి గర్భంలోనే తెగిపోయింది. సింధ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భిల్ లేదా భీల్ హిందూ వర్గానికి చెందిన 32 ఏళ్ల నిండు గర్భిణీ ప్రసవవేదనతో సమీపంలోని ఆర్‌హెచ్‌సీ(రూరల్ హెల్త్ సెంటర్)కి వెళ్లింది. కానీ అక్కడ గైనకాలజిస్ట్ అందుబాటులో లేరు. దీంతో   అనుభవంలేని సిబ్బంది ఆపరేషన్ నిర్వహిస్తూ గర్భంలోని శిశువు తలను కట్ చేశారు. దీంతో తల గర్భంలోనే మిగిలిపోయింది.

ఈ ఘటన బాధిత మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. దీంతో హుటాహుటిన ఆమెను సమీపంలోని మరో హాస్పిటల్‌ మిథికి తరలించారు. అక్కడ కూడా సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఎల్‌యూఎంహెచ్‌ఎస్‌కు తరలించారు. అక్కడి ఆపరేషన్ నిర్వహించి శిశువు తలను బయటకు తీశారు. దీంతో బాధిత మహిళకు ప్రాణపాయం తప్పింది. శిశువు తల భాగం గర్భంలో చిక్కుకుంది. దీంతో పొత్తి కడుపు ఆపరేషన్ నిర్వహించి తలను తొలగించామని లిఖ్వాయత్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్(ఎల్‌యూఎంహెచ్ఎస్)లో గైనకాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ రహీల్ సికందర్ వెల్లడించారు. ఈ ఘటనపై సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం మెడికల్ దర్యాప్తునకు ఆదేశించింది. అసలేం జరిగింది, నిందితులు ఎవరనేది తేల్చాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-06-21T20:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising