ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూస్టర్‌ డోస్‌ వేసుకున్న Stalin, OPS

ABN, First Publish Date - 2022-01-12T15:22:23+05:30

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సమన్వ యకర్త ఒ.పన్నీర్‌సెల్వం మంగళవారం కరోనా నిరోధక బూస్టర్‌ డోస్‌ టీకా తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు నిరంతరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే సమన్వ యకర్త ఒ.పన్నీర్‌సెల్వం మంగళవారం కరోనా నిరోధక బూస్టర్‌ డోస్‌ టీకా తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు నిరంతరం సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది, అరవయ్యేళ్ళకు పైబడినవారికి బూస్టర్‌ డోస్‌ టీకాలు వేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్థానిక ఆళ్వార్‌పేటలో కావేరి ఆసుపత్రిలో బూస్టర్‌ డోస్‌ టీకా వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా తాను బూస్టర్‌ డోస్‌ వేసుకున్నానని తెలిపారు. గత ఏప్రిల్‌ 14వ తేదీకి ముందు రెండో డోస్‌ టీకాలు వేసుకున్నవారంతా తప్పకుండా బూస్టర్‌ డోస్‌ టీకాలు వేసుకుని ప్రభుత్వం చేపడుతున్న కరోనా నిరోధక ఉద్యమానికి దోహదం చేయాలని పిలుపు నిచ్చారు. అన్నాడీఎంకే సమన్వయకర్త, మాజీ ముఖ్య మంత్రి ఒ.పన్నీర్‌సెల్వం స్థానిక అమింజికరైలోని ఎంజీఎం ఆసుపత్రిలో బూస్టర్‌ డోస్‌ టీకా వేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల బారిన పడకుండా ఉండాలంటూ ప్రజలందరూ రెండు డోస్‌ల టీకాలు తప్పకుండా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రూపాంతరం చెందిన ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి అధికమవుతున్న సమయంలో అరవైయేళ్ళకు పైబడిన వృద్ధులంతా బూస్టర్‌ డోస్‌ టీకాలు వేసుకోవాలని, ఈ టీకాలు వేసుకుంటేనే ప్రాణపాయం నుంచి తప్పించుకోవచ్చునని ఆయన చెప్పారు. 



Updated Date - 2022-01-12T15:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising