ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mlc Elections: అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్‌ మాలిక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ABN, First Publish Date - 2022-06-17T22:25:23+05:30

మహారాష్ట్ర కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik), మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ (Anil Deshmukh) లకు ముంబై హైకోర్టులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik), మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ (Anil Deshmukh) లకు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర శాసన మండలి (MLC) ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని కోరుతూ వీరు దాఖలు చేసిన పిటిషన్లను ముంబై హైకోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 20న జరగాల్సి ఉన్నాయి.


కాగా, శుక్రవారం సాయంత్రానికల్లా లిఖిత పూర్వక ఆదేశాలు అందుబాటులో ఉంచుతామని జస్టిస్ ఎన్‌జే జమదార్ తెలిపారు. దీనికి నవాబ్ మాలిక్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఎన్నికలు సోమవారంనాడు జరగాల్సి ఉన్నందున కాస్త ముందుగానే ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. హైకోర్టు ఆదేశాలపై సోమవారం ఉదయమే సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో నవాబ్ మాలిక్ లీగల్ టీమ్ ఉంది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాబ్ మాలిక్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా, అనిల్ దేశ్‌ముఖ్ సైతం ప్రస్తుతం జ్యుడిషయల్ కస్టడీలోనే ఉన్నారు. దీనికి ముందు, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాల్సిందిగా నవాబ్ మాలిక్, అనిల్ దేశ్‌ముఖ్ దాఖలు చేసుకున్న పిటిషన్లను కూడా ముంబై కోర్టు తోసిపుచ్చింది.

Updated Date - 2022-06-17T22:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising