ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యాయత్నం కేసు.. బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణేకు ముందస్తు బెయిలు నిరాకరణ

ABN, First Publish Date - 2022-01-17T21:29:22+05:30

హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణేకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణేకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సహ నిందితుడైన మనీశ్ దాల్వికి మాత్రం బెయిలు లభించింది. అంతకుముందు ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్‌ను మహారాష్ట్ర, సింధుదుర్గ్ జిల్లాలోని సెషన్స్ కోర్టు కొట్టివేసింది. 


కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కుమారుడైన నితీశ్ రాణే సింధు దుర్గ్  జిల్లాలోని కంకాల్వి స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంకాల్వి పరిధిలో సంతోష్ పరబ్ (44)పై గతేడాది డిసెంబరు 18న జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నితీశ్ రాణే.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆ రోజు పరబ్ బైక్‌వై వెళ్తుండగా నంబరు ప్లేటు లేని ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. పరబ్ కింద పడగానే కారు నుంచి దిగిన వ్యక్తి తన చాతీలో కత్తితో పొడిచినట్టు పరబ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత వారు పారిపోతూ ఈ విషయాన్ని గోత్యా సావంత్, నితీశ్ రాణేకు చెప్పాలని అనుకోవడం తాను విన్నానని ఆయన చెప్పారు. 


కాగా, రాజకీయాల నుంచి తనను తప్పించేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్ర ఇదని, కాబట్టి తనకు బెయిలు ఇప్పించాలని కోర్టుకు సమర్పించిన బెయిలు పిటిషన్‌లో నితీశ్ రాణే కోరారు. ఈ కేసులో తన ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారని పేర్కొన్నారు. తానిప్పుడు బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నానని, తనపై ఇప్పుడు బలవంతపు చర్యలు తీసుకుంటే అది తన ప్రచారంపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.


తనపై ఎఫ్ఐఆర్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం జోక్యాన్ని కూడా కొట్టిపడేయలేమన్నారు. అయితే, నిందితుడు రాణేకు బెయిలు ఇస్తే అది విచారణపై ప్రభావం చూపించే అవకాశం ఉందని, కాబట్టి బెయిలు ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది సుదీప్ పాస్బోలా పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం రాణేకు బెయిలు నిరాకరించింది. 

Updated Date - 2022-01-17T21:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising