ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

San Francisco airport కి bomb కలకలం.. టెర్మినల్ ఖాళీ చేయించిన అధికారులు

ABN, First Publish Date - 2022-07-16T22:31:43+05:30

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయా(San Francisco international airport)నికి బాంబు బెదిరింపు(bomb scare) రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై టెర్మినల్‌ను ఖాళీ చేయించారు. శుక్రవారం సాయంత్రం ఈ బెదిరింపు వచ్చిందని అయితే అర్థరాత్రి 12 గంటల సమయానికి మళ్లీ సాధారణ పరిస్థితిలోకి ఎయిర్‌పోర్ట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయా(San Francisco international airport)నికి బాంబు బెదిరింపు(bomb scare) రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై టెర్మినల్‌ను ఖాళీ చేయించారు. శుక్రవారం సాయంత్రం ఈ బెదిరింపు వచ్చిందని అయితే అర్థరాత్రి 12 గంటల సమయానికి మళ్లీ సాధారణ పరిస్థితిలోకి ఎయిర్‌పోర్ట్ వాతావరణం వచ్చిందని అధికారులు తెలిపారు. అనుమానిత ప్యాకెజ్‌లో బాంబు ఉందని ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం అందిందని, దీంతో అంతర్జాతీయ టెర్మినల్‌ను ఖాళీ చేయించి, డొమెస్టిక్ టెర్మినల్ నుంచి కొంత సమయం పాటు రాకపోకలను కొనసాగించినట్లు శాన్‌ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో శాన్‌ ఫ్రాన్సిస్కో  విమానాశ్రయం ఒకటి. అధికారిక గణాంకాల ప్రకారం.. 2020లో ఈ విమానాశ్రయం నుంచి సుమారు 30 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. బాంబు కలకలం కారణంగా ఎయిర్‌పోర్ట్‌కు లింకై ఉన్న రైలు సర్వీసులను సైతం రద్దు చేశారట. పరిస్థితులు అదుపులోకి రాగానే తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-07-16T22:31:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising