ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bahamas : సముద్రంలో పడవ బోల్తా...17మంది హైతీ వలసదారుల మృతి

ABN, First Publish Date - 2022-07-25T12:54:28+05:30

హైతీ వలసదారులతో( Haitian migrants) అక్రమంగా ప్రయాణిస్తున్న పడవ(Boat) బహామాస్(Bahamas) సముద్రంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైతీ: హైతీ వలసదారులతో( Haitian migrants) అక్రమంగా ప్రయాణిస్తున్న పడవ(Boat) బహామాస్(Bahamas) సముద్రంలో బోల్తా(capsized) పడింది. ఈ దుర్ఘటనలో 17మంది హైతీ వలసదారులు మరణించారు.పడవ బోల్తా పడిన సముద్రంలో బహామియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. పడవలో ఉన్న 25 మందిని రక్షించినట్లు హైతీ అధికారులు తెలిపారు.న్యూ ప్రొవిడెన్స్ నుంచి ఏడు మైళ్ల దూరంలో పడవ మునిగిపోయింది. మృతుల్లో 15 మంది మహిళలు, ఒక పురుషుడు, ఒక శిశువు ఉన్నారని ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. పడవ ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ట్విన్-ఇంజన్ స్పీడ్ బోట్ బహామాస్ నుంచి 60 మంది వలసదారులతో బయలుదేరి ప్రమాదానికి గురైందని డేవిస్ చెప్పారు.


అక్రమంగా వలసదారుల స్మగ్లింగ్ ఆపరేషన్‌పై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించినట్లు డేవిస్ చెప్పారు.‘‘ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయాలనుకుంటున్నాను’’ అని డేవిస్ అన్నారు. గత జులైలో హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యకు గురైన ఒక సంవత్సరం తర్వాత దేశంలో హింస మరింత పెరిగింది.దీంతో హైతీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ గందరగోళం మధ్య మెరుగైన, సురక్షితమైన జీవితాన్ని వెతుక్కుంటూ 11 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉన్న దేశం నుంచి ప్రజలు పారిపోవడానికి యత్నిస్తున్నారు.ఈ సంవత్సరం కరేబియన్‌లో వలసదారులతో కూడిన పలు పడవలు మునిగిపోయాయి. మే నెలలో వలసదారుల పడవ మునిగి 11 మంది మరణించారు. జనవరిలో జరిగిన మరో సంఘటనలో ఫ్లోరిడాలో 40 మంది వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగింది. 


Updated Date - 2022-07-25T12:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising