ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Union Minister నారాయణ్ రాణేకు బీఎంసీ షాక్

ABN, First Publish Date - 2022-04-19T12:59:24+05:30

సాక్షాత్తూ కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాక్ ఇచ్చింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8 అంతస్తుల జుహు బంగ్లా క్రమబద్ధీకరణకు నో

ముంబై (మహారాష్ట్ర): సాక్షాత్తూ కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షాక్ ఇచ్చింది. ముంబై నగరంలోని జుహూ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన 8 అంతస్తుల బంగళా క్రమబద్ధీకరణ ప్రతిపాదనను బీఎంసీ తిరస్కరించింది. కేంద్రమంత్రి బంగళా నిర్మాణం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలకు విరద్ధంగా ఉందని, రాణే అభ్యర్థనను తోసిపుచ్చింది. బంగళా ఎత్తు 32 మీటర్లు, గరిష్ఠంగా 11.75 మీటర్ల ఎత్తు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి కేంద్రమంత్రి ఇల్లు నిర్మించారని బీఎంసీ పేర్కొంది. రాణే తన దరఖాస్తులో నిర్మాణం యొక్క పూర్తి లేఅవుట్‌ను సమర్పించలేదని, ఫలితంగా క్రమబద్ధీకరణ అభ్యర్థన ఆమోదించమని మున్సిపాలిటీ పేర్కొంది.


తన బంగళా ఆదేశ్‌లో అనధికారిక నిర్మాణం, మార్పులపై బీఎంసీ గతంలో రాణేకి రెండు నోటీసులు పంపింది. బంగ్లా బేస్‌మెంట్‌లో,బంగ్లాలోని ఏడవ అంతస్థు మినహా అన్నింటిలో ఉపయోగంలో అనేక మార్పులు చేశారని మొదటి నోటీసు పేర్కొంది.మున్సిపాలిటీ ఆమోదించిన ప్లాన్‌కు విరుద్ధంగా టెర్రస్ గార్డెన్‌లకు బదులు మొదటి నుంచి ఎనిమిదో అంతస్తు వరకు అక్రమ గదులు నిర్మించారని రెండో నోటీసులో పేర్కొంది.తన ఇష్టానుసారం బంగ్లాలో అనధికారిక నిర్మాణాన్ని తొలగించేందుకు రాణే నిరాకరించడంతో మార్చి 21న బీఎంసీ కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది.దీనిపై కేంద్రమంత్రి రాణే బొంబాయి హైకోర్టులో బీఎంసీ ఉత్తర్వును సవాలు చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేత ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.


Updated Date - 2022-04-19T12:59:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising