ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

36,000 గుడుల్ని ధ్వంసం చేశారు: Karnataka మంత్రి KE

ABN, First Publish Date - 2022-05-27T21:17:48+05:30

శ్రీరంగపట్నలో హనుమంతుడి గుడి ఉండేదని ముస్లింలు కూడా ఈరోజు అంగీకరిస్తున్నారు. ఆ సమయంలో గుడిని తరలించి ఆ స్థలంలో మసీదు నిర్మించారు. కానీ ఆ ప్రాంతంలో ఎందుకు మసీదు నిర్మించారో అర్థం కావడం లేదు. దీనికి సమాధానాలు రావాలి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశాన్ని పాలించిన మొఘలులు 36,000 దేవాలయాల్ని కూల్చివేశారని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాటన్నిటినీ తిరిగి స్థాపిస్తుందని కర్ణాటక మాజీ మంత్రి కేఈ ఈశ్వరప్ప అన్నారు. శుక్రవారం రాష్ట్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు. ఈ సమావేశంలో మాండ్యలోని జామియా మసీదు అంశాన్ని లేవనెత్తారు కేఈ. హనుమంతుడి గుడి ఉన్న ప్రాంతంలో విగ్రహాలను పక్కకు జరిపి మసీదు కట్టారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటకను టిప్పు సుల్తాన్ పాలించినప్పుడు మాండ్య రాజధానిగా ఉండేది. అందుకే బీజేపీ దీన్ని ఉద్దేశపూర్వకంగా వివాదస్పదం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.


‘‘శ్రీరంగపట్నలో హనుమంతుడి గుడి ఉండేదని ముస్లింలు కూడా ఈరోజు అంగీకరిస్తున్నారు. ఆ సమయంలో గుడిని తరలించి ఆ స్థలంలో మసీదు నిర్మించారు. కానీ ఆ ప్రాంతంలో ఎందుకు మసీదు నిర్మించారో అర్థం కావడం లేదు. దీనికి సమాధానాలు రావాలి. అసలు కాంగ్రెస్ ఈ విషయం గురించి మాట్లాడటం లేదు. దీనిపై వారి వైఖరి ఏంటో ప్రజలకు తెలియజేయాలి. ఈ దేశాన్ని మొఘలులు పాలించిన సమయంలో 36,000 దేవాలయాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ వాటన్నిటికీ అధికారికంగా చట్టబద్ధంగా పునరుద్ధరిస్తుంది’’ అని కేఈ అన్నారు. కొద్ది రోజుల క్రితం ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కేఈ మంత్రి పదవి కోల్పోయిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-27T21:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising