ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andheri East by-poll: పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ

ABN, First Publish Date - 2022-10-17T20:32:37+05:30

అంథేరి ఈస్ట్ ఉపఎన్నిక చి తప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: అంథేరి ఈస్ట్ ఉపఎన్నిక (Andheri East by-poll) పోటీ నుంచి తప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ (Bjp) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి మూర్జి పటేల్‌ (Murji patel)ను ఆదేశించింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాన్‌కులే (Chandrasekhar Bawankule) సోమవారంనాడు తెలియజేశారు. పోటీ నుంచి అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని పార్టీ నిర్ణయించిందని, లేకుంటే తామే నెగ్గి ఉండేవారమని అన్నారు. బీజేపీ గతంలోనూ కొన్ని ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న అంథేరి ఈస్ట్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.


దివంగత ఎమ్మెల్యే రమేష్ లట్కే స్థానంలో ఆయన భార్య రుతుజ లట్కే (Rutuja Latke) పోటీ చేస్తున్నందున ఆమె ఎన్నిక ఏకగ్రీవం చేయాలని, ఆమెపై పోటీకి అభ్యర్థిని నిలవద్దని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇప్పటికే లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని ఎన్నికల బరి నుంచి ఉపసంహరించుకోవాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ సోమవారంతోనే ముగియనుంది. ఉప ఎన్నికల్లో రుతుజ లట్కే ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం అభిలషించారు. 

Updated Date - 2022-10-17T20:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising