ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణిపూర్‌లో వికటించిన పొత్తు.. ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం

ABN, First Publish Date - 2022-01-30T18:46:01+05:30

నిజానికి కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీలు కలిసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఆ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా, ఉప ముఖ్యమంత్రి వై.జోయ్ కుమార్‌లతో పాటు ఇరు పార్టీల అధినేతలు పాల్గొన్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంఫాల్: మణిపూర్‌లో నేషనల్ పీపుల్స్ పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఉన్న పొత్తు వికటించింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి వెళ్తున్నట్లు బీజేపీ ఆదివారం ప్రకటించింది. నిన్నటి వరకు ఎన్‌పీపీతో కలిసే బీజేపీ పోటీ చేయనుందని అనుకున్నప్పటికీ ఇరు పార్టీ మధ్య సీట్ల పంపకాల్లో ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో 40 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితం ఎన్‌పీపీ అధినేత, మణిపూర్ సీఎం కోన్రాడ్ సంగ్మా ప్రకటించారు. అయితే సగం స్థానాలు కావాలని బీజేపీ పట్టు పట్టినట్లు సమాచారం.


నిజానికి కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీలు కలిసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఆ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా, ఉప ముఖ్యమంత్రి వై.జోయ్ కుమార్‌లతో పాటు ఇరు పార్టీల అధినేతలు పాల్గొన్నారు. కానీ బీజేపీ అధిష్టానం సగం సీట్లు కావాలంటూ కోన్రాడ్‌ను కోరింది. ఆయన అందుకు ఒప్పుకోకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగడానికి బీజేపీ సిద్ధపడినట్లు రాజకీశ విశ్లేషకులు అంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ ‘‘రాబోయే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి 60 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలబెడుతున్నాం. రాష్ట్రంలో 2/3 వంతు మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-30T18:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising