ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Goaలో హంగ్ ఏర్పడితే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మద్ధతు కోసం బీజేపీ యత్నాలు

ABN, First Publish Date - 2022-03-10T13:21:21+05:30

గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) మద్ధతు పొందాలని బీజేపీ యోచిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగంలోకి దిగిన గోవా ఇన్‌చార్జి ఫడణవీస్

పనాజీ : గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) మద్ధతు పొందాలని బీజేపీ యోచిస్తోంది.ప్రస్థుతం ఎంజీపీ మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది.గోవాలో హంగ్ ఏర్పడుతుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య ఎంజీపీకి కొన్ని సీట్లు వస్తే ఆ పార్టీ కింగ్ మేకర్ గా మారనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.2019లో ఎంజీపీకి బీజేపీతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ బీజేపీకి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాని పక్షంలో ఎంజీపీ మద్ధతు పొందటానికి ఆ పార్టీ గోవా ఇన్ చార్జి దేవేంద్ర ఫడణవీస్ యత్నిస్తున్నారు.


 తమ బీజేపీకి మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో సహజ మిత్రత్వం ఉందని ఫఢణవీస్ చెప్పారు. పంజిమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ వివాదాస్పద శాసనసభ్యుడు అటనాసియో బాబుష్ మాట్లాడుతూ తాము స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.అవసరమైతే ఎంజీపీ మద్ధతు ఇస్తుందని తనకు నమ్మకముందని అటనాసియో చెప్పారు.2017 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ గోవా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంజీపీ సహాయం చేసింది.


గోవాలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ మరణించిన కొద్దికాలానికే ఎంజీపీకి చెందిన సుధీన్ ధవ్లీకర్‌ను గోవాలోని బీజేపీ ప్రభుత్వం నుంచి 2019 మార్చిలో అనాలోచితంగా తొలగించారు.దీంతో తాము బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోబోమని అప్పటి నుంచి ప్రమాణం చేసిన ఎంజీపీ చీఫ్ మళ్లీ మనసు మార్చుకుంటారని బీజేపీ భావిస్తోంది.


Updated Date - 2022-03-10T13:21:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising