ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BJP State President: ఒంటరిగా పోటీచేసే సత్తా ఉంది

ABN, First Publish Date - 2022-11-29T10:22:57+05:30

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగలిగేలా పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బీజేపీ నేత అన్నామలై

చెన్నై, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగలిగేలా పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) అన్నారు. చెన్నైలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని అధిష్టానవర్గానికి తాను త్వరలో ప్రతిపాదించనున్నామన్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు పొన్‌రాధాకృష్ణన్‌ ఈ విషయమై స్పందిస్తూ రాష్ట్రంలో అన్నాడీఎంకేతో సమానంగా బీజేపీ ఎదుగుతోందని, ప్రజల మద్దతు రోజురోజుకూ అధికమవుతోందని, ఈ పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావించడం తప్పుకాదన్నారు. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా? లేక ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోవాలా? అనే విషయంపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతానికి బీజేపీ అన్నాడీఎంకే కూటమిలోనే ఇంకా కొనసాగుతోందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-11-29T10:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising