ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాన్ని కూల్చడం మా లక్ష్యం కాదు

ABN, First Publish Date - 2022-06-02T13:09:49+05:30

తాము విడుదలచేసే అవినీతి చిట్టా చూసిన తర్వాత అయినా డీఎంకే నేతల్లో మార్పు రావాలన్నదే తమ ఆలోచన తప్ప.. ఆ ప్రభుత్వాన్ని కూల్చడం తమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - Bjp State President అన్నామలై 


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 1: తాము విడుదలచేసే అవినీతి చిట్టా చూసిన తర్వాత అయినా డీఎంకే నేతల్లో మార్పు రావాలన్నదే తమ ఆలోచన తప్ప.. ఆ ప్రభుత్వాన్ని కూల్చడం తమ లక్ష్యం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. తిరుచ్చిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. 2014 నుంచి పేదలకు 52 లక్షల ఇల్లు నిర్మించడంతో పాటు 2024లోగా అన్ని గృహాలకు తాగునీటి కనెక్షన్ల అందించే బృహత్తర పథకం చేపట్టామన్నారు. ఆధార్‌-రేషన్‌ కార్డులను అనుసంధానం చేయడంతో ద్వారా 4 కోట్ల నకిలీ రేషన్‌కార్డులు తొలగించామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని, రాష్ట్ర పోలీసు శాఖ అధికార పార్టీ నేతల చేతుల్లో బందీగా ఉందని ఆరోపించారు. ఏడాది పాలనలో అవినీతి చోటుచేసుకుందని, రాబోయే రెండేళ్లలో మరింత అవినీతి జరిగే అవకాశముందన్నారు. అధికార డీఎంకే పాల్పడుతున్న అవినీతిపై ఫిర్యాదులకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబరు పరిచయం చేయాలని అన్నామలై ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-06-02T13:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising