ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరపరాధి కాదు...

ABN, First Publish Date - 2022-05-20T13:14:56+05:30

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురూ ముద్దాయిలేనని, వారు సంబరాలు చేసుకొనే వ్యక్తులు కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. నగరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - Bjp రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై


పెరంబూర్‌(చెన్నై): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురూ ముద్దాయిలేనని, వారు సంబరాలు చేసుకొనే వ్యక్తులు కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తనకున్న ప్రత్యేక అధికారాన్ని వినియోగించి పేరరివాలన్‌ను విడుదల చేసిందన్నారు. పలు ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న అతను, సత్ప్రవర్తన కారణంగా విడుదలయ్యారని, సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తున్నామన్నారు. కాగా ఆయన నిరపరాది కాదని, అతను ముద్దాయి అని, డీఎంకే ప్రభుత్వం అతడిని నిరపరాధిగా భావిస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు వేడుకలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ప్రధాని హత్యకేసులో వారి చర్యలు నిరూపితమై శిక్ష పొందారని, ప్రస్తుతం వారిలో ఒకరు విడుదలయ్యారని, మిగిలినవారికి ఈ తీర్పు వర్తించదని తెలిపారు. పేరరివాలన్‌ నిరపరాధి అని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొలేదని అన్నామలై గుర్తుచేశారు.

 

కార్యకర్తలు క్షమించరు: మాజీ సీఎం నారాయణస్వామి

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకేసు ముద్దాలను సోనియా గాంధీ కుటుంబం క్షమించినా కాంగ్రెస్‌ కార్యకర్తలు అందుకు సిద్ధంగా లేరని పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి తెలిపారు. పుదువైలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో సరైన వాదనలు, నిర్ణయాల్లో జాప్యం చేయడం వల్లే పేరరివాలన్‌ విడుదలయ్యారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-05-20T13:14:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising