ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరరివాలన్‌తో సీఎం ఆలింగనం సరికాదు

ABN, First Publish Date - 2022-05-24T14:48:23+05:30

పేరరివాలన్‌ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందని, కానీ అతనిని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆలింగనం చేసుకోవడం రాష్ట్రానికి, రాష్ట్రప్రజలకు మంచిది కాదని బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - బీజేపీ సీనియర్‌ నేత పొన్‌. రాధాకృష్ణన్‌


పెరంబూర్‌(చెన్నై): పేరరివాలన్‌ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందని, కానీ అతనిని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆలింగనం చేసుకోవడం రాష్ట్రానికి, రాష్ట్రప్రజలకు మంచిది కాదని బీజేపీ సీనియర్‌ నేత పొన్‌.రాధాకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. నాగర్‌కోయిల్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీలంక తమిళులపై జరిగిన దాడులకు డీఎంకే -కాంగ్రెస్‌ కారణమని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు 2 ఎకరాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, అనంతరం రాష్ట్రంలో భూములు లేవని పేర్కొన్నారని గుర్తుచేశారు. అలాగే ప్రస్తుతం పలు హామీలు గుప్పించి అధికారం చేపట్టిన సీఎం స్టాలిన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం, ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతోందని, అప్పటికీ, ఇప్పటికీ ఆ పార్టీ ప్రజలు మభ్యపెట్టడం మినహా రాష్ట్రం, ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. మరో నాలుగేళ్లు గడిచిన తర్వాత మేము మంత్రులము అని ఇప్పుడు తెలుస్తోందని వారు మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబానికీ రూ. 15 లక్షలు అందిం చేంత  నల్ల డబ్బు దేశంలో ఉందని మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారని, కానీ ఆయన మాటలను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ మార్చి, ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామని చెబుతున్నారని, కాం గ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే రూ.15 లక్షలు ఇవ్వవచ్చని పొన్‌.రాధాకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-24T14:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising