ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం.. బెంగాల్‌లో బీజేపీ ఆఫీస్‌కు నిప్పు

ABN, First Publish Date - 2022-06-11T01:50:28+05:30

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హౌరాలో శుక్రవారం కొందరు ఆందోళనకు దిగి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఆందోళనకారులు రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించారు. హౌరా-ఖరగ్‌పూర్ మార్గంలో చెంగల్ స్టేషన్ వద్ద ప్రజలు ఆందోళనకు దిగడంతో ఆగ్నేయ రైల్వే పలు రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది.  


మరోవైపు, హౌరాలోని ఉలుబెరియా ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. పార్టీ కార్యాలయం తగలబడుతున్న వీడియోను బీజేపీ నేత అనిర్బన్ గంగూలీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిని, రాళ్లు విసిరిన వారిని, కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీని డిమాండ్ చేశారు. 



Updated Date - 2022-06-11T01:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising