ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajya Sabha: రాజ్యసభకు మాజీ ముఖ్యమంత్రి...బీజేపీ తాజా ప్రతిపాదన

ABN, First Publish Date - 2022-09-10T13:46:00+05:30

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ను(Biplab Deb) రాజ్యసభకు పంపించాలని భారతీయ జనతాపార్టీ తాజాగా నిర్ణయించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ను(Biplab Deb) రాజ్యసభకు పంపించాలని భారతీయ జనతాపార్టీ తాజాగా నిర్ణయించింది. త్రిపుర రాష్ట్రంలో త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిగా(Rajya Sabha Candidate) విప్లవ్‌దేవ్‌ పేరును ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి(ex chief minister) దేవ్‌ను శుక్రవారం హర్యానా(haryana) రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జీగా నియమిస్తున్నట్లు బీజేపీ(bjp) ప్రకటించిన వెంటనే అతనికి రాజ్యసభ సభ్యుడిని చేయాలని నిర్ణయించింది.2018వసంవత్సరం ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడానికి విప్లవ్‌దేవ్‌ సహకారం అందించారు. 


త్రిపురలో 25 ఏళ్ల లెఫ్ట్ పాలన నుంచి బీజేపీ ఘన విజయం సాధించింది. 2018 మార్చి9వతేదీన విప్లవ్‌దేవ్‌ త్రిపుర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఈ ఏడాది మే 14వతేదీన సీఎం పదవి నుంచి దిగిపోయారు. దేవ్ స్థానంలో మాణిక్ సాహ సీఎం అయ్యారు. తనను రాజ్యసభ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షాలకు విప్లవ్‌దేవ్‌ కృతజ్ఞతలు తెలిపారు.తాను త్రిపుర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని దేవ్ ట్వీట్(tweet) చేశారు. మాణిక్ సాహా రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు ఈ నెల 22వతేదీన ఎన్నిక జరగనుంది. 

Updated Date - 2022-09-10T13:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising