ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దూ వైపే అధిష్టానం... శివకుమార్ ఓ రబ్బరు స్టాంపు

ABN, First Publish Date - 2022-07-15T18:22:33+05:30

రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌ పరిస్థితి రబ్బర్‌ స్టాంపుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందని దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌ పరిస్థితి రబ్బర్‌ స్టాంపుగా మారిందని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధిష్టానం శక్తిని కోల్పోయిందని ఎద్దేవా చేశారు. పార్టీ నిర్వీర్యమైందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. ప్రజల డిమాండ్‌లు తీర్చే శక్తి ఆ పార్టీ నేతలకు లేకుండా పోయిందన్నారు. రాహుల్‌గాంధీ సిద్దరామోత్సవలో పాల్గొనేందుకు వస్తున్నారంటే పార్టీ ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. కాంగ్రెస్‌ నిర్వీర్యం దిశగా వెళుతోందన్నారు. రాష్ట్ర పార్టీకు అధ్యక్షులుగా డీకే శివకుమార్‌ రబ్బర్‌స్టాం్‌పగా మిగిలారని ఎద్దేవా చేశారు. సిద్దరామయ్యను చూస్తే కాంగ్రెస్‌ ఉలికి పడుతోందన్నారు. ఆయనను వ్యతిరేకిస్తే భవిష్యత్‌ ఏమి కానుందో అనే భయం వారికి వెంటాడుతోందన్నారు. సిద్దరామయ్య ఒకప్పటి దేవరాజు అరసును మించిన నాయకత్వ లక్షణాలు కలిగినవారని పరమేశ్వర్‌ వ్యాఖ్యానించారన్నారు. మూతి కాలిన పిల్లి తరహాలో సిద్దరామయ్యను పొగడక పోతే ఏం జరుగుతుందో అనే ఆలోచనలో పడ్డారన్నారు. ఓ వైపు సిద్దరామోత్సవ, మరో వైపు శివకుమారోత్సవలో పేరుతో అనేకమైన ఉత్సవాలకు పార్టీ సిద్దమవుతోందన్నారు. దేశచరిత్రలో ఉత్సవాలు పరిశీలిస్తే అది కేవలం గాంధీ కుటుంబాలకు మాత్రమే పరిమితంగా ఉండేదన్నారు. రాజీవ్‌గాంధీ కంటే ముందు అనేలా వ్యవహరించినందుకు వీపీ సింగ్‌కు చిత్రహింసలు చేశారని అదే పరిస్థితి రాష్ట్రంలో సిద్దరామోత్సవ ద్వారా నాయకులలో భయం వెంటాడుతోందని అందుకే అందరూ మద్దతిచ్చేందుకు సిద్దమయ్యారన్నారు.

Updated Date - 2022-07-15T18:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising