ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారాలొద్దు

ABN, First Publish Date - 2022-01-21T15:33:27+05:30

గణతంద్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రప్రభుత్వం శకటానికి చోటు దక్కక పోవడంపై డీఎంకే, దాని మిత్రపక్షాలు కేంద్ర ప్రభు త్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - Bjp Mla వానతి శ్రీనివాసన్‌ 


పెరంబూర్‌(చెన్నై): గణతంద్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్రప్రభుత్వం శకటానికి చోటు దక్కక పోవడంపై డీఎంకే, దాని మిత్రపక్షాలు కేంద్ర ప్రభు త్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌ హితవు పలికారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాల ద్వారా వెల్లడిస్తుంటారన్నారు. కానీ, గణతంద్ర దినోత్సవ వేడుకల్లో 50కి పైగా శకటాలు పాల్గొనేందుకు వీలు లేదన్నారు. అందులోనూ కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది 12 శకటాలు మాత్రమే అనుమతించారని, దీంతో పలు రాష్ట్రాలకు చెందిన శకటాలకు కూడా చోటు దక్కలేదన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారన్నారు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా అధికార డీఎంకే, మిత్రపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అదే సమయంలో చెన్నైలో నిర్వహించే వేడుకల్లో రాష్ట్రప్రభుత్వ శకటాన్ని ప్రదర్శనకు ఉంచుతామనే ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటనను స్వాగతిస్తున్నామని వానతీ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-01-21T15:33:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising