ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

hairstylist Jawed Habib సెలూన్‌లు మూసివేయకుంటే ఆందోళన...బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక

ABN, First Publish Date - 2022-01-08T15:52:07+05:30

ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ జావేద్ హబీబ్ ఔట్‌లెట్లను 48 గంటల్లో మూసివేయాలని, లేకుంటే తాను ఆందోళనకు దిగుతానని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్ (మధ్యప్రదేశ్)‌: ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ జావేద్ హబీబ్ ఔట్‌లెట్లను 48 గంటల్లో మూసివేయాలని, లేకుంటే తాను ఆందోళనకు దిగుతానని మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ విజయవర్గియ ఇండోర్ నగర అధికారులను హెచ్చరించారు.జనవరి 3వతేదీన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఒక సంఘటన యొక్క వీడియోలో, హబీబ్ ఒక మహిళ తలపై ఉమ్మివేయడం కనిపిస్తుంది.నీటి కొరత ఉంటే లాలాజలం వాడండి అని జావేద్ హబీబ్ వ్యాఖ్యానించారు.మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర జావేద్ హబీబ్ పై ఇండియన్ పీనల్ కోడ్, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897లోని సెక్షన్ 355 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.‘‘ఇండోర్ జిల్లాలోని జావేద్ హబీబ్ సెలూన్లు, శిక్షణ కేంద్రాలను మూసివేయాలని డిమాండు చేస్తూ ఆందోళన చేయబోతున్నాను’’ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ కుమారుడు అయిన ఎమ్మెల్యే ఆకాష్ విజయవర్గియ ట్వీట్ చేశారు.


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జావేద్ హెయిర్‌స్టైలిస్ట్‌ల వాణిజ్య సంస్థలను మూసివేయాలని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదేశించాలని మధ్యప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి నేహా బగ్గా డిమాండ్ చేశారు.హబీబ్ యొక్క సెలూన్‌లను బహిష్కరించాలని మహిళలు, యువకులను ఆయన కోరారు. బీజేపీ సభ్యుడిగా చెప్పుకుంటున్న హబీబ్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ పంపినట్లు స్థానిక బీజేపీ నేత సుమిత్ మిశ్రా తెలిపారు.


Updated Date - 2022-01-08T15:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising