ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెక్యూరిటీ ఆఫీసర్ టీకి వెళ్లిన సమయంలో BJP నేత హత్య

ABN, First Publish Date - 2022-05-25T18:06:51+05:30

తమిళనాడు బీజేపీ(BJP) నేత బాలచంద్రన్(Balachandran) దారుణ హత్యకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాడు బీజేపీ(BJP) నేత బాలచంద్రన్(Balachandran) దారుణ హత్యకు గురయ్యారు. బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు హత్య చేసి పరారయ్యారు. పీఎస్ వో(పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) టీ బ్రేక్ తీసుకున్న సమయంలో క్షణాల వ్యవధిలో దాడికి పాల్పడ్డారు. పాత కక్షలే కారణమనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాణహాని ఉందని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం బాలచంద్రన్ కు ఇదివరకే పీఎస్ వో(పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) నియమించింది. అయినా ప్రయోజనం దక్కలేదు. తమిళనాడు బీజేపీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఎస్ సీ, ఎస్ టీ వింగ్ చైర్మన్ గా బాలచంద్రన్ పనిచేస్తున్నారు.


నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్టు చెన్నై కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకర్ జివాల్ ప్రకటించారు. కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని, సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా ఈ హత్యను తమిళనాడు విపక్ష నేత, ఏఐడీఎంకే పార్టీకి చెందిన ఈకే పళనిస్వామి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర పోలీసుల ఘోరవైఫల్యంగా ఆయన అభివర్ణించారు. చెన్నై నగరంలో కేవలం 20 రోజుల వ్యవధిలో ఈ తరహా 18 హత్యలు జరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యలు చెన్నై నగరాన్ని హత్యల నగరంగా మార్చివేస్తున్నాయని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-05-25T18:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising