ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప ఎన్నికల్లో పత్తాలేని బీజేపీ.. పుంజుకున్న కాంగ్రెస్

ABN, First Publish Date - 2022-04-16T20:34:02+05:30

బిహార్‌లోని బొచహన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ అభ్యర్థఇ అమర్ కుమార్ పాశ్వాన్ 48.52 ఓట్ల శాతంతో 82547 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కసీటు కూడా గెలవలేకోయింది. అయితే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మినహా మిగిలిన అన్ని చోట్ల బీజేపీ ద్వితియ స్థానంలో ఉండడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బిహార్‌లలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది.


బిహార్‌లోని బొచహన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్జేడీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ అభ్యర్థఇ అమర్ కుమార్ పాశ్వాన్ 48.52 ఓట్ల శాతంతో 82547 ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి యశోదా నీలాంబర్ వర్మ 53.55 ఓట్ల శాతంతో విజయం సాధించారు. మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే జోరు కొనసాగించింది. కొల్లాపూర్ నార్త్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జయశ్రీ చంద్రకాంత్ ఏకంగా 53.93 ఓట్ల శాతంతో 83,088 ఓట్లు సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఎన్సీపీ, శివసేన పోటీకి దూరంగా ఉన్నాయి.


ఇక పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. బల్లిగుంగె అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నుంచి టీఎంసీకి వచ్చిన సింగర్ బాబూల్ సుప్రియో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో సీపీఎం అనూహ్యంగా రెండో స్థానంలోకి రావడం గమనార్హం. టీఎంసీ 49.22 శాతం, సీపీఎం 30.89 శాతం ఓట్లు రాబట్టగా బీజేపీ కేవలం 12.31 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇక అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి శత్రుఘన్ సిన్హా విజయం సాధించారు. గతంలో బీజేపీ నేత అయిన శత్రుఘన్.. మొదట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అనంతరం కొద్ది రోజుల క్రితం టీఎంసీలో చేరారు. 

Updated Date - 2022-04-16T20:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising