ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ఇలాఖా వరణాసిలో 6 సీట్లలో బీజేపీ అభ్యర్థుల ముందంజ...2 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఎదురుగాలి

ABN, First Publish Date - 2022-03-10T17:37:01+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వరణాసి పార్లమెంటు నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరణాసి (ఉత్తరప్రదేశ్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వరణాసి పార్లమెంటు నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మోదీ నియోజకవర్గంలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల కంటే సమాజ్‌వాది పార్టీ ముందంజలో ఉంది. 2017 ఎన్నికలలో, వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో వచ్చే అన్ని స్థానాలను బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి.తొలి రౌండ్ కౌంటింగ్‌లో వారణాసిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరింటిలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిక్యంలో ఉంది.అజాగర, సేవాపురి, రోహనియా, శివపూర్, వారణాసి కంట్, వారణాసి ఉత్తరాలలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.వారణాసి కంట్లో, వారణాసి సౌత్‌లో సమాజ్‌వాదీ పార్టీ ముందంజలో ఉంది.


వారణాసి కంట్లో ఎస్పీకి చెందిన పూజా యాదవ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు సౌరభ్ శ్రీవాస్తవపై తొలి రౌండ్‌లో 2,717 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వారణాసి కంట్లో సెగ్మెంట్ బీజేపీ కంచుకోటగా పరిగణిస్తుంటారు. 1991 నుంచి జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటు వేస్తున్నారు.1989 నుంచి బీజేపీ గెలుపొందిన వారణాసి సౌత్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన కామేశ్వర్ అలియాస్ కిషన్ దీక్షిత్, రెండు రౌండ్ల లెక్కింపు తర్వాత బీజేపీకి చెందిన నీలకంత్ తివారీ కంటే ముందంజలో ఉన్నారు.



2017 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ దాని మిత్రపక్షం అప్నా దళ్,  మునుపటి మిత్రపక్షం ఎస్బీఎస్పీ మొత్తం ఎనిమిది స్థానాలు (బీజేపీ-6, అప్నాదళ్ -1 ఎస్బీ ఎస్పీ-1 స్థానాలు) గెలుచుకున్నాయి.మొత్తం మీద మోదీ పార్లమెంటు సెగ్మెంటులోని రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఎదురు గాలి వీచినట్లు అయింది.

Updated Date - 2022-03-10T17:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising