ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మగవాళ్ల చేతుల్లో డబ్బుంటే మద్యానికే’

ABN, First Publish Date - 2022-04-29T14:47:00+05:30

పురుషుల చేతిలో డబ్బులు ఉంటే వాటిని సిగరెట్లకు, మద్యానికి ఖర్చు చేస్తారని, అదే మహిళల చేతిలో డబ్బులుంటే అది కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌


అడయార్‌(చెన్నై): పురుషుల చేతిలో డబ్బులు ఉంటే వాటిని సిగరెట్లకు, మద్యానికి ఖర్చు చేస్తారని, అదే మహిళల చేతిలో డబ్బులుంటే అది కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, గురువారం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించే అంశంపై సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా పురుషుల చేతిలో డబ్బుంటే టాస్మాక్‌ దుకాణాలకు, సిగరెట్లకు ఖర్చు చేస్తారంటూ వ్యాఖ్యానించారు. దీనికి అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో ఆమె తాను పురుషులందరినీ అనడం లేదని కొందరిని మాత్రమే అంటున్నాంటూ చెప్పుకొచ్చారు. ఇంతలో సభాపతి కల్పించుకుని ఆన్‌లైన్‌ గురించి మాత్రమే మాట్లాడాలని సూచించడంతో సభలో నవ్వులు పూశాయి. 

Updated Date - 2022-04-29T14:47:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising