ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Haryana MC polls.. BJP-JJP విజయం.. ఆప్ ఫేవరెట్: సర్వేలు

ABN, First Publish Date - 2022-06-19T23:50:56+05:30

ఈ ఎన్నికల్లో బీజేపీ-జేజేపీ కలిసి పోటీ చేశాయి. సీట్ల పంపకాలతో ఎవరి పార్టీ గుర్తుపై వారే పోటీ చేశారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీలోనే లేకపోవడం గమనార్హం. పార్టీలోని వ్యక్తులు పోటీ చేస్తే మద్దతు ఇస్తామని ప్రకటించినప్పటికీ పార్టీ గుర్తుపై పోటీ చేయడం లేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్రంలోని 46 మున్సిపాలిటీలకు ఆదివరం ఎన్నికలు జరిగాయి. జూన్ 22న విడుదల కానున్న ఈ ఎన్నికల ఫలితాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, జన్‌నాయక్ జనతా పార్టీ(BJP-JJP) కూటమే విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ బాగా ప్రభావం చూపొచ్చని కూడా అంచనాలు వెలువడుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 90 అసెంబ్లీ స్థానాలకు గాను 46 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఏ స్థానంలోనూ డిపాజిట్ సాధించని ఆప్.. ఈ ఎన్నికల నాటికి బాగా బలపడిందని అంటున్నారు.


ఈ ఎన్నికల్లో బీజేపీ-జేజేపీ కలిసి పోటీ చేశాయి. సీట్ల పంపకాలతో ఎవరి పార్టీ గుర్తుపై వారే పోటీ చేశారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీలోనే లేకపోవడం గమనార్హం. పార్టీలోని వ్యక్తులు పోటీ చేస్తే మద్దతు ఇస్తామని ప్రకటించినప్పటికీ పార్టీ గుర్తుపై పోటీ చేయడం లేదు. ఇది అధికార పార్టీకి బాగా కలిసి వచ్చింది. ఇక అధికార కూటమి తర్వాత అందరి కళ్లు ఆప్ మీదే ఉన్నాయి. హర్యానా సరిహద్దు రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ అధికారంలో ఉండడం.. కొద్ది రోజుల క్రితం జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 92 స్థానాలు గెలిచి ఆప్ ఘన విజయం సాధించడంతో ఈ ప్రభావం హర్యానాపై ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి.


28 మునిపల్ కమిటీలు, 18 మున్సిపల్ కౌన్సిల్లలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 4,712 ఈవీఎంలతో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజు జరుగుతున్న పోలింగ్‌లో ఏమైనా అవకతవకలు జరిగినట్లైతే జూన్ 21న రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 5 గంటలకు వరకు రాష్ట్రవ్యాప్తంగా 56 శాతం పోలింగ్ నమోదు అయింది.

Updated Date - 2022-06-19T23:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising