ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఈడీ అధికారి రాజేశ్వర్ సింగ్‌కు బీజేపీ టికెట్

ABN, First Publish Date - 2022-02-02T15:56:44+05:30

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్‌ను భారతీయ జనతాపార్టీ ఎన్నికల బరిలోకి దించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో (ఉత్తరప్రదేశ్): ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ జాయింట్ డైరెక్టర్ రాజేశ్వర్ సింగ్‌ను భారతీయ జనతాపార్టీ ఎన్నికల బరిలోకి దించింది. స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన రాజేశ్వర్ సింగ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సరోజినినగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ డీల్ కేసులో కార్తీ చిదంబరం, ఆయన తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంలను రాజేశ్వర్ సింగ్ విచారించారు.రాజేశ్వర్ సింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి మాతృసంస్థ అయిన బీజేపీలోకి చేరారని కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు.2009 నుంచి యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఎయిర్ సెల్ మ్యాక్సిస్ అవినీతి కేసుల దర్యాప్తులో రాజేశ్వర్ సింగ్ కీలకపాత్ర పోషించారు.


కాంగ్రెస్, మిత్రపక్షాల అగ్రనేతలు కీలక నిందితులుగా బయటపడిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపు కేసు, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం కేసులను రాజేశ్వర్ సింగ్ విచారించారు. రాజేశ్వర్ సింగ్ కొత్త ఇన్నింగ్స్ కు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే శుభాకాంక్షలు తెలిపారు. దానికి రాజేశ్వర్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న స్వాతి సింగ్ స్థానంలో ఈయనను రంగంలోకి దింపారు.రాజేశ్వర్ సింగ్ బీజేపీలో చేరడంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.బీజేపీ నాయకుడు రాజేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, తాను పాలనను మెరుగుపరుస్తానని, మాఫియాలకు వ్యతిరేకంగా తన పనిని కొనసాగిస్తానని చెప్పారు.


Updated Date - 2022-02-02T15:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising