ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణపై జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లకు ప్రధాని దిశానిర్దేశం

ABN, First Publish Date - 2022-06-08T01:20:03+05:30

న్యూఢిల్లీ: తెలంగాణపై జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలంగాణపై జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాని నివాసంలో సాయంత్రం ఆరు గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ప్రతి కార్పొరేటర్‌తోనూ ప్రధాని మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువుల గురించి, యోగ క్షేమాల అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చెయాలని 47 మంది కార్పొరేటర్లకు ప్రధాని సూచించారు. అందరితో మాట్లాడిన అనంతరం సమావేశానికి హాజరైన నేతలతో ప్రధాని గ్రూపు ఫోటో దిగారు.  ప్రధానితో భేటీ అయిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు తదితరులున్నారు. ప్రధానితో సమావేశానికి ముందే బీజేపీ సంస్థగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బియల్ సంతోష్ హైదరాబాద్ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 



Updated Date - 2022-06-08T01:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising