ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ రెబల్ నాయకురాలు ఆదితిసింగ్‌కు రాయబరేలీ బీజేపీ టికెట్

ABN, First Publish Date - 2022-01-22T15:29:26+05:30

కాంగ్రెస్ తిరుగుబాటు నాయకురాలు అదితి సింగ్‌ను రాయ్‌బరేలీ నుంచి బీజేపీ పోటీకి దింపింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తిరుగుబాటు నాయకురాలు అదితి సింగ్‌ను రాయ్‌బరేలీ నుంచి బీజేపీ పోటీకి దింపింది. ఇటీవలే ఐపీఎస్‌కు రాజీనామా చేసిన అసిమ్ అరుణ్ ను కన్నౌజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు 85 మంది అభ్యర్థులతో కూడిన మరో జాబితాను బీజేపీ తాజాగా విడుదల చేసింది. అదితి సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ యొక్క రాయ్ బరేలీ పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చే నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే.ఇటీవలే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.  సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ బంధువు, ప్రస్తుత ఎమ్మెల్యే హరిఓమ్ యాదవ్ కు కూడా బీజేపీ టికెట్ ఖరారు చేసింది. 


హరిఓమ్ యాదవ్ ప్రస్తుత స్థానం సిర్సాగంజ్ నుంచి బరిలోకి దిగుతున్నారు.గత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలీలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో రెండు నియోజకవర్గాల్లో గెలుపొందగా, ఒకటి సమాజ్‌వాదీ పార్టీకి దక్కింది.లఖింపూర్ ఖేరీ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. లఖింపూర్ ఖేరీ జిల్లాలో పార్టీ శశాంక్ వర్మ (నిఘాసన్), అరవింద్ గిరి (గోలా గోకరానాథ్), మంజు త్యాగి (శ్రీనగర్), యోగేష్ వర్మ (లఖింపూర్ ఖేరీ), సౌరభ్ సింగ్ సోను (కాస్తా), లోకేంద్ర ప్రతాప్ సింగ్ (మొహమ్మది),హర్విందర్ రోమి సాహ్ని (పలియా) అభ్యర్థిత్వాలను బీజేపీ ప్రకటించింది.


లఖింపూర్ ఖేరీ ఇటీవల నలుగురు నిరసన రైతులను వాహనాలు ఢీకొనడంతో వార్తల్లో నిలిచింది. గతేడాది అక్టోబరులో జరిగిన హింసాకాండలో ఓ జర్నలిస్టు, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు సహా మరో నలుగురు చనిపోయారు. ఈ హింసాకాండలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను నిందితుడిగా చేర్చారు.


Updated Date - 2022-01-22T15:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising