ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయన ఏం తప్పు చేశారని రాజీనామా చేయాలి..?

ABN, First Publish Date - 2022-02-19T17:09:09+05:30

రాజీనామా చేసేటంతటి తప్పు మంత్రి ఈశ్వరప్ప ఏంచేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ప్రశ్నించారు. శుక్రవారం విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని అవమానించారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి


బెంగళూరు: రాజీనామా చేసేటంతటి తప్పు మంత్రి ఈశ్వరప్ప ఏంచేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ప్రశ్నించారు. శుక్రవారం విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని అవమానించారా అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు నైతికత లేదన్నారు. మంత్రి ఈశ్వరప్ప ఎందుకు రాజీనామా చేయాలన్నారు. వారికి కాషాయం గురించి ఏం తెలుసన్నారు. 1893లో సామూహిక గణేశ్‌ ఉత్సవాల ద్వారా కాషాయం జెండాతో ప్రజలను చైతన్యం తీసుకువచ్చేందుకు సాధ్యమైందన్నారు. జాతీయజెండాను అందరూ గౌరవిస్తామన్నారు. పరిషత్‌ ప్రతిపక్షనేత బీకే హరిప్రసాద్‌ ప్రాణాలకు ముప్పు అంశమై మాట్లాడుతూ ఒకనాటి కొత్వాల్‌ శిష్యులే నేడు కాంగ్రె్‌సలో ఉన్నారన్నారు. ఆయనను ఎవరైనా బెదిరిస్తారా... అయనే ఎంతోమందిని బెదిరించారు. ఆయనను బెదిరించి జీవించడం సాధ్యమేనా..? అదే మార్గంలోనే ఆయన ఎదిగారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎర్రకోటపై కాషాయం జెండా ఎగరనుందనడంలో తప్పేముందన్నారు. అందులో తప్పుందని భావిస్తే కోర్టుకు వెళ్లవచ్చునన్నారు. శాసనసభ సమయం వృథా అవుతోందని విచారం వ్యక్తం చేశారు. దారితప్పించే కుట్రలో భాగం మినహా మరొకటి లేదన్నారు. ఒకప్పుడు కొవిడ్‌కు వ్యాక్సిన్‌ వేసుకుంటే చనిపోతారని తప్పుడు ప్రచారం చేసినవారని, వారి నుంచి ఏమి అర్థం చేసుకోవడం సాధ్యమన్నారు.

Updated Date - 2022-02-19T17:09:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising