ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిలేష్ పాక్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

ABN, First Publish Date - 2022-01-24T20:53:29+05:30

భారత్‌కు పాకిస్థాన్ 'రాజకీయ శత్రువు' మాత్రమేనంటూ సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: భారత్‌కు పాకిస్థాన్ 'రాజకీయ శత్రువు' మాత్రమేనంటూ సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సోమవారంనాడు మండిపడింది. అఖిలేష్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని (జనవరి 24) దేశం జరుపుకొంటున్న తరుణంలో భారత్‌కు పాక్ నిజమైన శత్రువు కాదని అఖిలేష్ పేర్కొనడం ఏమిటని ప్రశ్నించారు.


యూపీ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్న నేరగాళ్లకు సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెనన్‌ను ఉరితీసి ఉండకపోతే ఆయనను దేశభక్తుడిగా ప్రకటిస్తూ సమాజ్‌వాదీ పార్టీ  టిక్కెట్ కూడా ఇచ్చేదంటూ ఎద్దేవా చేశారు. దీనిని ముందు, అఖిలేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మన నిజమైన శత్రువు చైనా అనీ, పాకిస్థాన్ మన రాజకీయ శత్రువు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీజేపీ పాకిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.

Updated Date - 2022-01-24T20:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising