ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత MPలతో Bjp భారీ విందు సమావేశం

ABN, First Publish Date - 2022-07-13T21:05:00+05:30

భారతీయ జనతా పార్టీ ఈనెల 16న తమ ఎంపీలందరితో భారీ విందు సమావేశం ఏర్పాటు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) ఈనెల 16న తమ ఎంపీలందరితో భారీ విందు సమావేశం (Big Dinner Meet) ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ విందు సమావేశంలో చర్చిస్తారు. పార్లమెంటు బిల్డింగ్ ఆవరణలోని జేఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈ విందు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది.


రాష్ట్రపతి ఎన్నిక జూలై18న జరగనుండగా, అదే రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కాగా, శనివారం సాయంత్రం కల్లా ఎంపీలు అందరూ ఢిల్లీకి చేరుకోవాలని బీజేపీ ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే మరో సమావేశం జూలై 17న జరుగనుంది. ఇందులో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మంత్రులు, ఎంపీలు పాల్గొంటారు.


కాగా, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ వంటి బీజేపీయేతర విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ పడుతున్నారు. ప్రాంతీయ పార్టీలైన బీజేడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఎస్‌పీ, ఏఐఏ‌డీఎంకె, టీడీపీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్, శివసేన మద్దతుతో ద్రౌపది ముర్ము ఇప్పటికే 60 శాతం ఓట్ షేర్ దాటేశారు.

Updated Date - 2022-07-13T21:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising