ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ ప్రభుత్వ బాటలోనే బీజేపీ.. ఎన్నికలను వాయిదా వేయాలని విజ్ఞప్తి

ABN, First Publish Date - 2022-01-17T00:20:12+05:30

పంజాబ్‌లో వచ్చే నెల 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్‌లో వచ్చే నెల 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను కనీసం ఆరు రోజులపాటు వాయిదా వేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఎన్నికల కమిషన్‌ను కోరిన కొన్ని గంటలకే బీజేపీ కూడా అటువంటి విజ్ఞప్తే చేసింది.


గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రం నుంచి దాదాపు 20 లక్షల మంది షెడ్యూలు తెగల భక్తులు ఫిబ్రవరి 10-16 మధ్య యూపీలోని వారణాసిని సందర్శిస్తారని, కాబట్టి వారంతా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతారని ఈసీకి రాసిన లేఖలో చన్నీ కోరారు. కాబట్టి ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.


తాజాగా బీజేపీ కూడా ఇలాంటి విజ్ఞప్తే చేసింది. గురు రవిదాస్ జయంతి నేపథ్యంలో ఎన్నికను వాయిదా వేయాలని కోరింది. అయితే, చన్నీ, బీజేపీ అభ్యర్థనలపై ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు స్పందించలేదు.     


Updated Date - 2022-01-17T00:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising