ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రెండు పార్టీలతోనే బరిలోకి దిగనున్న బీజేపీ

ABN, First Publish Date - 2022-01-20T00:34:00+05:30

అప్నాదళ్(ఎస్), నిషాద్ పార్టీలతో కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్నాం. ఈ ఎన్నికలపై చాలా వివరంగా చర్చించాము. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి పోటీ చేస్తుంది. మరోసారి ఎన్డీయే 300లకు పైగా స్థానాల్ని గెలుస్తుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎన్డీయే పూర్తి స్థాయిలో సిద్ధమైంది. బుధవారం కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎన్డీయే సమావేశంలో అప్నాదళ్(ఎస్), నిషాద్ పార్టీలతో కలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. కాగా, ఈ రెండు పార్టీలతో బీజేపీ ఇప్పటికే పొత్తులో ఉంది. అయితే ఇదే పొత్తును వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగించాలని ఈనాటి సమావేశంలో నిర్ణయించినట్లు నడ్డా పేర్కొన్నారు.


ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నడ్డా మాట్లాడుతూ ‘‘అప్నాదళ్(ఎస్), నిషాద్ పార్టీలతో కలిసి ఈ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్నాం. ఈ ఎన్నికలపై చాలా వివరంగా చర్చించాము. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే కూటమి పోటీ చేస్తుంది. మరోసారి ఎన్డీయే 300లకు పైగా స్థానాల్ని గెలుస్తుంది’’ అని జేపీ నడ్డా అన్నారు. అయితే మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై నడ్డా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే తమకు 30 స్థానాలు కావాలని అప్నాదళ్‌ కోరిన విషయం తెలిసిందే. 2017 నాటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేసిన అప్నాదళ్.. 9 స్థానాలు గెలుచుకుంది. ఇక నిషాద్ పార్టీ ప్రతిపాదన గురించి వెల్లడించలేదు.

Updated Date - 2022-01-20T00:34:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising