ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్‌లో కొనసాగుతున్న ‘అగ్నిపథ్’ ఆందోళనలు.. రైలు సర్వీసుల నిలిపివేత

ABN, First Publish Date - 2022-06-18T23:05:55+05:30

‘అగ్నిపథ్’ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బీహార్‌లో నేటి (శనివారం) రాత్రి 8 గంటల వరకు రైలు సర్వీసులు నిలిపివేశారు. ఆ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: ‘అగ్నిపథ్’ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బీహార్‌లో నేటి (శనివారం) రాత్రి 8 గంటల వరకు రైలు సర్వీసులు నిలిపివేశారు. ఆ తర్వాత రైల్వే అధికారులు మరో ప్రకటన చేస్తూ రేపు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి 8 వరకు కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్‌మెంట్‌ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మక రూపు దాలుస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ చేపట్టిన బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో మరోమారు హింసాత్మక ఘటనలు జరిగాయి. బంద్‌ నిర్వహిస్తున్న నిరసనకారులు ఓ రైల్వే స్టేషన్, ఓ పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. నిరసనకారుల రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. కేంద్ర ప్రకటించిన ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ, బీహర్, యూపీ, హర్యానా సహా పలు రాష్ట్రల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. 


Updated Date - 2022-06-18T23:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising