ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nitish Kumar Cabinet: బిహార్ మంత్రి సుధాకర్ సింగ్ రాజీనామా

ABN, First Publish Date - 2022-10-02T20:04:45+05:30

బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ (Sudhakar

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ సింగ్ (Sudhakar Singh) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతోందని, వారి తరపున పోరాడుతానని ఆయన చెప్పినట్లు ఆయన తండ్రి, ఆర్జేడీ బిహార్ శాఖ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ (Jagdanand Singh) చెప్పారు. 


జగదానంద్ సింగ్‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, సుధాకర్ సింగ్ రైతు సమస్యలపై పోరాడాలని కోరుకుంటున్నారు. ఈ పోరాటంలో ఆయనకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. 


రైతులకు అన్యాయం జరుగుతోందని, వారికి మద్దతుగా ఎవరో ఒకరు నిలబడాలని, అందుకే  ఆ పనిని తన కుమారుడు చేపట్టారని  జగదానంద్ చెప్పారు. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని రద్దు చేయడం వల్ల బిహార్ రైతులు నాశనమవుతున్నారని చెప్పారు. రైతులకు మేలు చేయాలనే తన కుమారుడు మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు. 


Updated Date - 2022-10-02T20:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising