ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar CM Nitish Kumar calls key meeting: వేడెక్కిన బీహార్ రాజకీయాలు...సీఎం నితీష్ రేపు కీలక సమావేశం

ABN, First Publish Date - 2022-08-08T17:02:56+05:30

బీజేపీ, జేడీ(యూ) పక్షాల మధ్య విభజన చర్చ నేపథ్యంలో బీహార్(Bihar) రాజకీయాలు మరో సారి వేడెక్కాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా(బీహార్): బీజేపీ, జేడీ(యూ) పక్షాల మధ్య విభజన చర్చ నేపథ్యంలో బీహార్(Bihar) రాజకీయాలు మరో సారి వేడెక్కాయి. బీహార్‌ రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చీలిక వస్తుందనే ఊహాగానాల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Bihar CM Nitish Kumar) మంగళవారం(రేపు) అఖిలపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలతో (meeting of JDU MPs MLAs)కీలక సమావేశాన్ని(key meeting) ఏర్పాటు చేశారు.గత కొంతకాలంగా బీహార్ రాష్ట్రంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)(JDU), బీజేపీల(BJP) మధ్య విబేధాలు రాజుకున్నాయి.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి(Niti Aayog meet chaired by PM Modi) గైర్హాజరయ్యారు.


దీంతో జేడీ(యూ),బీజేపీల మధ్య చీలిక ఏర్పడుతుందనే పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. సీఎం నితీష్ కుమార్ గత కొన్ని నెలలుగా బీజేపీపై శీత కన్ను వేశారు.దీంతో ఆగస్ట్ 11వతేదీ లోపు బీహార్‌లో ఎన్డీఏ పాలన కూలిపోతుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. జేడీ(యూ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాజీ మిత్రపక్షమైన ఆర్జేడీతో చేతులు కలుపుతుందనే ఊహాగానాలు ఏర్పడ్డాయి. బీహార్‌లో జేడీ(యూ)-బీజేపీ పొత్తు తెగిపోతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చాలా మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు విముఖత చూపుతున్నందున,బీహార్లో అధికారాన్ని నిలుపుకోవడానికి ఆ పార్టీ ఆర్‌జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్‌లతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని రాజకీయ వర్గాలు తెలిపాయి.


గత నెల జులై 17వతేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలిచిన అన్ని ముఖ్యమంత్రుల సమావేశానికి నితీష్ కుమార్ హాజరు కాలేదు.ఆ తర్వాత జులై 22వతేదీన పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందుకు నితీష్ ను ఆహ్వానించినా, నితీష్ మళ్లీ ఆ విందుకు దూరంగా ఉన్నారు.రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు ఎన్నికల్లో మద్ధతు ఇచ్చినప్పటికీ ఆమె ప్రమాణస్వీకారోత్సవానికి నితీష్ వెళ్లలేదు. 


Updated Date - 2022-08-08T17:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising