ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు వడ్డీ రహిత రుణాలు

ABN, First Publish Date - 2022-04-26T16:59:32+05:30

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం బనారస్ హిందూ యూనివర్శిటీ(బీహెచ్‌యూ) కీలక నిర్ణయం తీసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Banaras హిందూ యూనివర్శిటీ వెల్లడి

వారణాసి: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం బనారస్ హిందూ యూనివర్శిటీ(బీహెచ్‌యూ) కీలక నిర్ణయం తీసుకుంది. బలహీనమైన ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు వడ్డీ రహిత రుణ సహాయ పథకాన్ని బీహెచ్‌యూ ప్రారంభించింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, కొవిడ్ వల్ల తల్లిదండ్రులు మరణించిన వారి విద్యార్థులకు ఏటా వార్షిక సహాయంగా రూ.12వేలను ఇవ్వాలని నిర్ణయించారు. బీహెచ్‌యూ ఫ్యాకల్టీ సభ్యుల సిఫార్సు మేర విద్యార్థులకు ఈ ఆర్థిక సాయం అందించనున్నారు.విద్యార్థులు తమ చదువులను పూర్తి చేసేందుకు వీలుగా విశ్వవిద్యాలయం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.


 బీహెచ్‌యూ ఇచ్చే ఆర్థిక సహాయం వడ్డీ లేని రుణంగా ఉంటుందని జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి, 1,000 మంది విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనం అందించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు 200 దరఖాస్తులు రాగా,వాటిలో 103 దరఖాస్తులను ఆమోదించినట్లు జైన్ తెలిపారు.విద్యార్థి ఉపాధి పొందిన తర్వాత రెండేళ్లలో వాయిదాల వారీగా రుణాలు చెల్లించవచ్చని వీసీ పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-26T16:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising