ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కోరెగావ్‌’ నిందితుడు గౌతమ్‌కు గృహనిర్బంధం

ABN, First Publish Date - 2022-11-11T03:33:31+05:30

భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడు గౌతమ్‌ నౌలఖా గృహనిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన్ను నెల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడు గౌతమ్‌ నౌలఖా గృహనిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన్ను నెల రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. గౌతమ్‌ను నిర్బంధంలో ఉంచే ఇంటి పరిసరాలను సమగ్రంగా పరిశీలించాలని, 48 గంటల ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించింది. గృహనిర్బంధ సమయంలో భద్రతా ఏర్పాట్ల కోసం రూ.2.40 లక్షలు డిపాజిట్‌ చేయాలని గౌతమ్‌ను ఆదేశించింది. ‘‘గౌతమ్‌ను నెల రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతి ఇస్తున్నాం. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేయకుండా సాయుధ పోలీసులు పర్యవేక్షించాలి’’ అని గురువారం జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ హృషికే్‌షరాయ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. గృహనిర్బంధ సమయంలో ఆయనకు కొన్ని షరతులు విధించింది. నిందితుడు ముంబై/నవీ ముంబై దాటి వెళ్లడానికి వీల్లేదని.. రోజూ 3 గంటల పాటు కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చని తెలిపింది.

Updated Date - 2022-11-11T03:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising