ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25న Bharat Bandh కు పిలుపు

ABN, First Publish Date - 2022-05-22T20:23:43+05:30

కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం నిర్వహించనందుకు నిరసనగా, పలు డిమాండ్లతో ఈ బంద్‌కు ఫెడరేషన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఈనెల 25న భారత్ బంద్‌ (Bharat Bandh)కు All India Backward And Minority Communities Employees Fedaration పిలుపునిచ్చింది. కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం నిర్వహించనందుకు నిరసనగా, పలు డిమాండ్లతో ఈ బంద్‌కు ఫెడరేషన్ పిలుపునిచ్చినట్టు బహుజన్ ముక్తి పార్టీ షహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధిమాన్ (Neeraj Dhiman) తెలిపారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం తదితర అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను నీరజ్ కోరారు.


భారత్ బంద్‌ అంశాలివే...

-కుల ప్రాతిపదికగా ఓబీసీ జనాభా గణనను కేంద్రం చేపట్టకపోవడం

-ఈవీఎం స్కాండల్

-ప్రైవేటు రంగంలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు

-రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీ కోసం చట్టం రూపకల్పన.

-పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడం

-మధ్యప్రదేశ్, ఒడిశా పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లలో సెపరేట్ ఎలక్టొరేట్స్‌ను అమలు చేయడం.

-పర్యావరణ పరిరక్షణ పేరుతో గిరిజనులకు స్థానచలనం కలించడానికి వ్యతిరేకం.

-లాక్‌డౌన్‌లో వర్కర్లకు వ్యతిరేకంగా రహస్యంగా తెచ్చిన కార్మిక చట్టాలపై నిరసన.

ఈ అన్ని అంశాలపై ఈనెల 25న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాణిజ్య కార్యక్రమాలు, ప్రజా రవాణాను నిలిపివేయాలని కోరుతూ సోషల్ మీడియాలో ఫెడరేషన్ ప్రచారం సాగిస్తోంది.

Updated Date - 2022-05-22T20:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising