ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాయ్-లాంగ్.. ఇది సరికొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.. అభివృద్ధి చేసింది మనోళ్లే!

ABN, First Publish Date - 2022-03-19T00:18:13+05:30

బ్రాండ్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి వచ్చేసింది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా, జావా స్క్రిప్ట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బ్రాండ్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి వచ్చేసింది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా, జావా స్క్రిప్ట్, సి ప్లస్ ప్లస్, పైథాన్‌ సహా మరికొన్ని ప్రోగ్రామ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి మరోటి వచ్చి చేరింది.


ఇటీవలే వచ్చిన దీనిపేరు ‘భాయ్-లాంగ్’. టైప్ స్క్రిప్ట్‌లో రాసిన ఇది టాయ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాబట్టి ప్రోగ్రామింగ్‌ సరదాగా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది కంప్యూటర్ కోర్సులు చేస్తున్నారు. వీరిలో అధికశాతం మంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌‌లు నేర్చుకుంటున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఆధారిత ‘భాయ్-లాంగ్’ సరికొత్త ఆప్షన్ కానుంది.


భాయ్.. అంటే హిందీలో సోదరుడు. ఈ లాంగ్వేజ్‌ను ఉపయోగించేటప్పుడు  ‘హాయ్ భాయ్’ అని ఎంట్రీపాయింట్ కోడ్ రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి దానిని ‘బై భాయ్’ అని ముగించాల్సి ఉంటుంది. కోడ్స్ అన్నింటినీ వీటి మధ్యే రాయాల్సి ఉంటుంది. ఈ ట్యాగ్ లోపల రాసిన ప్రతి దానిని తీసుకుని, వెలుపల రాసిన కోడ్‌ను విస్మరిస్తుంది. వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి ప్రోగ్రామర్లు ‘భాయ్ యే హై’ని ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రోగ్రామర్ అవసరం ప్రకారం వేరియబుల్స్‌కు వేర్వేరు విలువలు, ఫంక్షన్స్ ఇవ్వొచ్చు. జావా స్క్రిప్ట్ ఎప్పుడూ ఇంత ఈజీగా లేదు.


ఈ సరికొత్త జావాస్క్రిప్ట్ లైబ్రరీని రిషభ్ త్రిపాఠి, అనికేత్ సింగ్ అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ డెవలపర్లు రూపొందించారు. వీరిద్దరు వరుసగా గ్రో, అమెజాన్‌లలో పనిచేస్తున్నారు. టాయ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని దాని వెబ్‌సైట్ bhailang.js.orgలో యాక్సెస్ చేయవచ్చు, దాని సోర్స్ కోడ్‌ని ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓ జోక్ ఫలితంగా ఈ లాంగ్వేజ్ రూపుదిద్దుకున్నట్టు దీని సృష్టికర్తలు తెలిపారు.  


Updated Date - 2022-03-19T00:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising