ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ కొత్త సీఎంగా భగవత్ మాన్?

ABN, First Publish Date - 2022-03-10T16:50:51+05:30

పంజాబ్‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజాబ్‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దూకుడు ప్రదర్శిస్తోంది. భారీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. పంజాబ్ మొత్తం స్థానాలు 117 కాగా తాజా ఫలితాల ప్రకారం ఆప్ 89 స్థానాలు అధిక్యంలో ఉంది. దీంతో ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని సమాచారం. ఇందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలియవచ్చింది. గట్టిపోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్.. ఆప్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ 13, బీజేపీ 5, ఇతరులు 10 స్థానాల్లో అభ్యర్థులు కొనసాగుతున్నారు.


ఇక ఆప్ భారీ అధిక్యత కనబరుస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు, నేతలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాజిక్ ఫిగర్‌ 59 దాటేసిన ఆప్ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖారరయినట్లే.. కాగా కాసేపట్లో పంజాబ్ సీఎం చన్నీ గవర్నర్‌ను కలిసి రాజీనామా చేయనున్నారు. ఒకప్పటి స్టాండప్ కమెడియన్, ప్రస్తుత ఆప్ ఎంపీ భగవత్ మాన్ పేరును పంజాబ్ సీఎం అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-03-10T16:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising