ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం... కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఆసక్తికర ట్వీట్...

ABN, First Publish Date - 2022-03-16T19:12:00+05:30

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్న సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు తనను ఆహ్వానించలేదని పేర్కొన్నారు. 


ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భగవంత్ మాన్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీకి మనీష్ తివారీ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. తనను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందువల్ల తాను ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీ తన పార్టీ (కాంగ్రెస్) ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన ప్రమాణ స్వీకారం చేసినపుడు తనను ఆహ్వానించకపోవడం విచిత్రమని పేర్కొన్నారు. 


మనీష్ తివారీ పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి  పంజాబ్‌కు వచ్చేవారిపై చన్నీ చేసిన వ్యాఖ్యలను మనీష్ తీవ్రంగా ఖండించారు. పంజాబ్ లౌకికవాద చరిత్రలో ఇటువంటి ఆలోచనలకు స్థానం లేదన్నారు. 


ఫిబ్రవరిలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. 117 స్థానాల్లో కేవలం 18 స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకోగలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ లభించింది. 




Updated Date - 2022-03-16T19:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising