ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాంసం అమ్మకాలపై నిషేధం

ABN, First Publish Date - 2022-08-18T16:16:44+05:30

శ్రీకృష్ణ జన్మాష్టమి(Krishna Janmashtami) సందర్భంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ)(Bengaluru civic body) సంచలన నిర్ణయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు:శ్రీకృష్ణ జన్మాష్టమి(Krishna Janmashtami) సందర్భంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ)(Bengaluru civic body) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాంసం అమ్మకాలను నిషేధిస్తూ బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 19వతేదీన శుక్రవారం బెంగళూరు(Bruhat Bengaluru Mahanagara Palike) నగరంలోని కబేళాలను మూసివేయాలనిచ (ban on slaughter), మాంసం దుకాణాలను మూసివేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారు.(order prohibiting animal slaughter and sale of meat on Krishna Janmashtami )శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో బెంగళూరు నగరంలో కబేళాలు మూసివేయడంతో పాటు మాంసం రిటైల్ విక్రయ దుకాణాలను మూసివేయాలని పశుసంవర్థకశాఖ ఆదేశాలు జారీ చేసింది. 


5,249వ కృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ అధికారులు మాంసం అమ్మకాలపై నిషేధం(sale of meat) విధించారు. గతంలో శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ నెలలోనూ మాంసం అమ్మకాలను నిషేధించారు. బెంగళూరు నగరంలో బసవజయంతి, మహా శివరాత్రి, గాంధీ జయంతి, సర్వోదయ డేల సందర్భంగా ఏడాదిలో 8 రోజుల పాటు మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నారు.  


Updated Date - 2022-08-18T16:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising