ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవితంలో ఎంత బీఫ్‌ తిన్నావ్‌?

ABN, First Publish Date - 2022-02-24T07:49:47+05:30

బిహార్‌లో యువకుడిని దారుణంగా హింసించి హత్య చేసిన వీడియో కలకలం రేపుతోంది. తనను వదిలేయాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీ పిల్లలకు కూడా పెట్టావా!

గోవుల్ని ఎక్కడ వధిస్తున్నారు?

బీఫ్‌ అమ్మేవారి పేర్లు చెప్పు

బిహార్‌లో యువకుడిని కొట్టి 

చంపిన వీడియో కలకలం

శాంతిభద్రతల్లేవ్‌: తేజస్వి


పట్నా, ఫిబ్రవరి 23: బిహార్‌లో యువకుడిని దారుణంగా హింసించి హత్య చేసిన వీడియో కలకలం రేపుతోంది. తనను వదిలేయాలని ఆ యువకుడు చేతులు జోడించి వేడుకున్నా.. ‘గోవుల్ని ఎక్క డ వధిస్తున్నారు? బీఫ్‌ అమ్మేవారి పేర్లు చెప్పు. నీ జీవితంలో ఎంత బీఫ్‌ తిన్నావు? నీ పిల్లలకూ పెట్టావా?’ అంటూ గో రక్షాదళంగా చెప్పుకొంటున్న వ్యక్తులు ఆ యువకుణ్ని కొడుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. అయితే, దుండగుల ముఖా లు వీడియోలో కనిపించ లేదు. సోషల్‌ మీడియా లో వైరల్‌గా మారిన ఈ వీడియో మంగళవారం పోలీసుల వద్దకు చేరింది. ఆ యువకుణ్ని చంపేసిన తర్వాత ఆనవాళ్లు తెలియకుండా మృతదేహం పై దుండగులు పెట్రోల్‌ పోసి తగులబెట్టేందుకు యత్నించారని స్థానిక పత్రికలు ప్రచురించాయి. త్వరగా మట్టిలో కలిసిపోయేందుకు మృతదేహం పై ఉప్పు కూడా చల్లారని, అనంతరం మృతదేహాన్ని బుర్హి గ్యాంగ్‌టక్‌ నది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టారని పేర్కొన్నాయి. నితీశ్‌ కుమార్‌ పాలనలో బిహార్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌(ఆర్జేడీ) విమర్శించారు. ‘సాక్షాత్తూ జేడీయూ సభ్యుడైన ముస్లిం యువకుడిని సజీవ దహనం చేశారు. ప్రజలు చట్టాన్ని ఎందుకు చేతుల్లోకి తీసుకుంటున్నారు?’ అని తేజస్వీ ట్వీట్‌ చేశారు. హత్యపై ఓ పత్రికలో వచ్చిన క్లిప్పింగ్‌ను దానికి జోడించారు. కాగా, హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే దుండగులు మతం రంగు పులమడానికి ఈ వీడియో తీసి వైరల్‌ చేశారని స్థానిక పోలీసులు ఆరోపించారు.

Updated Date - 2022-02-24T07:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising