ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BBMP: పాలికె ఎన్నికలపై రేపు ముందస్తు సభ

ABN, First Publish Date - 2022-08-19T17:53:27+05:30

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల కసరత్తు అంచెలంచెలుగా సాగుతోంది. ఈనెల 20న పాలికె ఎన్నికలకు సంబం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె ఎన్నికల కసరత్తు అంచెలంచెలుగా సాగుతోంది. ఈనెల 20న పాలికె ఎన్నికలకు సంబంధించి ముందస్తు సమావేశం జరుపదలపెట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(State Election Commission) కార్యాలయంలో మధ్యాహ్నం 3.30గంటలకు ప్రత్యేక సమావేశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌  కార్యాలయం ప్రకటించింది. కమీషన్‌ కార్యాలయంలోనే సమావేశం ఉంటుందని ప్రకటించారు. పాలికె ఎన్నికల ప్రక్రియ ఆ రంభం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సందర్భంలో ముందస్తు సభలో ఎన్ని అభ్యంతరాలు తలెత్తుతాయో అనేది కీలకం కానుంది. వార్డుల విభిజనతో పాటు రిజర్వేషన్‌ల ఖరారులోను అధికార బీజేపీ(BJP)కు అనుకూలం చేసుకుందనే విమర్శలున్నాయి. నిత్యం కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రాంతాల వారీగా నిరసనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. వార్డుల విభజనకు సుమారు 3వేలకు పైగా అభ్యంతరాలు రాగా అదే తరహాలోనే రిజర్వేషన్‌ల విషయంలోను దాదాపు అంతకంటే ఎక్కువగానే అభ్యంతరాలు వినతుల రూపంలో అందాయి. వీటిని పరిష్కరించకుండానే ఎన్నికల ప్రక్రియలో మరో ముందడగు అనే తరహాలో ముందస్తు సభకు కమిసన్‌ సిద్ధం కావడంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, జేడీఎస్‏లు ఏవిధంగా స్పందిస్తాయనేది కీలకంగా మారింది. 

Updated Date - 2022-08-19T17:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising